Bank Charges: ఎస్‌బీ‌ఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు

జూన్ నుంచి మొదలు కానున్న ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ఉన్నాయి. జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చే కీలక ఆర్ధిక సవాళ్లు ఏంటంటే:

Bank Charges: ఎస్‌బీ‌ఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు

Car

Bank Charges: క్యాలండర్ ప్రకారం సరిగా అర్ధ సంవత్సరంగా ప్రారంభం కానున్న జూన్ నెల నుంచి ఆర్ధికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకు, వాహన బీమా, గ్యాస్ ధరలు..ఇతర ఇంధన ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూన్ నుంచి మొదలు కానున్న ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ఉన్నాయి. జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చే కీలక ఆర్ధిక సవాళ్లు ఏంటంటే:

other stories:IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు

ఎస్‌బీ‌ఐ హోమ్ లోన్ వడ్డీ పెంపు:
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ రుణాలపై తన ఎక్సటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును (ఇబిఎల్ఆర్) 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి పెంచినట్లు, రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ను 6.65 శాతం ప్లస్ సిఆర్పికి సవరించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఎస్‌బీ‌ఐ హోమ్ లోన్ వడ్డీలు పెరుగుతాయని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. ఈబీఎల్ఆర్ (జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది) 7.05 శాతంగా ఉంది. ఇబిఎల్ఆర్ = 7.05 శాతం + CRP, ఆర్ఎల్ఎల్ఆర్ (జూన్ 1 నుండి అమల్లోకి వస్తుంది) 6.65 శాతం + సిఆర్పిగా ఉంటుంది.

కార్లు మరియు బైకుల ధరల్లో పెరుగుదల:
ఈ ఏడాది జూన్ 1 నుండి ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ యజమానులకు బీమా ధర పెరిగే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి వివిధ కేటగిరీల వాహనాలకు థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) పెంచనుంది. దీంతో కార్లు మరియు ద్విచక్ర వాహనాల రేట్లు కొంత పెరిగే అవకాశం ఉంది.

other stories: SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ

ఎల్పీజీ ధరల పెంపు:
గత వారం దేశీయ ఎల్పిజి ధరలు మారినప్పటికీ, పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు తదుపరి ద్రవ్యోల్బణం కారణంగా గ్యాస్ సరఫరా కంపెనీలు మరోసారి ఎల్పిజి రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1003గా ఉంది.

ఎటిఎఫ్ ధరల పెంపు:
ఎటిఎఫ్(Aviation Turbine Fuel) లేదా జెట్ ఇంధన ధరలు సాధారణంగా ప్రతి నెలా 1వ మరియు 16వ తేదీల్లో సవరించబడతాయి. మే 16న, ఎటిఎఫ్ ధర స్వల్పంగా 5.3 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది, ఈ సంవత్సరం వరుసగా 10 సార్లు పెంచడం వలన ఏటీఎఫ్ ధర కిలోలీటర్ కు 5.29 శాతం పెరిగి రూ.1,23,039.71 (లీటర్కు రూ.123)చేరుకుంది.