SBI : ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ ఛార్జీలు రీఫండ్‌

అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్‌ చేశామని వెల్లడించింది. పరిమితికి మించిన లావాదేవీలపై సహేతుకమైన ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటును 2012 ఆగస్టులో ఆర్బీఐ కల్పించిందని తెలిపింది.

SBI : ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ ఛార్జీలు రీఫండ్‌

Sbi Refund Charges Deducted From Basic Savings Bank Deposit Accounts

SBI Refund Charges : అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ… జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్‌ చేశామని వెల్లడించింది. పరిమితికి మించిన లావాదేవీలపై సహేతుకమైన ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటును 2012 ఆగస్టులో ఆర్బీఐ కల్పించిందని తెలిపింది. అందువల్లే, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు వసూలు చేసినట్టు తెలిపింది. 2016 జూన్‌ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు ప్రక్రియ అమలు జరిపినట్టు తెలిపింది. అలాగే, ఈ విషయంపై ఖాతాదారులకు ముందుగానే సమాచారమిచ్చినట్టు ఎస్బీఐ వెల్లడించింది.

అయితే, 2020 జనవరి 1 తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసిందని ఎస్బీఐ వెల్లడించింది. భవిష్యత్తులో డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని సీబీడీటీ బ్యాంకులకు సూచించిందని తెలిపింది. సీబీడీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్‌ చేసినట్టు వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 15, 2020 నుంచి అలాంటి ఛార్జీలేమీ వసూలు చేయడం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఓ రిపోర్టు ప్రకారం 2015-20 మధ్య కాలంలో సర్వీస్ చార్జెస్ రూపంలో ఎస్బీఐ సుమారు 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది.