SBI Loans: రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు ర‌ద్దు.. వ‌డ్డీరేట్ల‌ త‌గ్గింపు

భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేయడంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించిం

SBI Loans: రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు ర‌ద్దు.. వ‌డ్డీరేట్ల‌ త‌గ్గింపు

Sbi Loans

SBI Loans: భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేయడంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. భార‌త్ 75వ స్వాతంత్ర్య దినోత్సావ సందర్భంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఇప్పటికే హోమ్ లోన్స్ పై ప‌రిమిత కాలపు ఆఫర్‌ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించగా.. ఇప్పుడు కార్ లోన్స్ పై కూడా 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది. 2022 జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ఈ ఆఫర్‌ అమల్లో ఉండనుండగా.. ఈ ఆఫర్లోనే కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌పై 90 శాతం వ‌ర‌కు లోన్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది.

యోనో యాప్ ద్వారా కార్ లోన్ కోసం అప్లై చేసుకున్న‌వారికి 25 బేసిస్ పాయింట్లు (BPS) మేర వ‌డ్డీ రాయితీ ఆఫ‌ర్ చేస్తుండగా ఈ ఆఫర్ ద్వారా కొత్త కారు కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేసేవారు యోనో యాప్ వినియోగించి 7.5 శాతం అతి త‌క్కువ వార్షిక వ‌డ్డీతో లోన్ పొందవచ్చని తెలిపింది. అదే విధంగా గోల్డ్ లోన్స్ పై కూడా 75 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటు తగ్గించగా.. ఎస్బీఐ కస్టమర్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, యోనో యాప్‌ లలో దేనిద్వారా అయినా 7.5 శాతం వార్షిక వ‌డ్డీతో గోల్డ్ లోన్ తీసుకోవచ్చని.. అయితే.. యోనో యాప్ ద్వారా అప్లై చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబోమని తెలిపింది.

పర్సనల్ లోన్, పెన్ష‌న్ లోన్‌ వినియోగ‌దారులు ఏ ఛాన‌ల్‌ ద్వారా రుణం తీసుకున్న‌ప్ప‌టికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకోబోమని బ్యాంక్ ప్ర‌క‌టించగా.. పర్సనల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ వ‌ర్క‌ర్స్‌ కు 50 బేసిస్ పాయింట్ల ప్ర‌త్యేక వ‌డ్డీ రాయితీ ఇస్తుంది. దీన్ని త్వ‌ర‌లోనే కార్, గోల్డ్ లోన్స్ అప్లై చేసుకున్న వారికి కూడా అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది. ఇక, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌లను’ ప్రవేశపెట్టగా.. దీనిద్వారా 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ పొందవచ్చు. ఈ అఫర్ 2021 ఆగ‌స్టు నుంచి 2021 సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది.