SBI: గర్భిణీలను ఎస్బీఐ ఉద్యోగాల్లోకి తీసుకోదట

ఇండియాలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... రిక్రూట్మెంట్ నార్మ్స్ లోని నిబంధనలను సవరించింది. దీనిని బట్టి మూడు నెలల కంటే...

SBI: గర్భిణీలను ఎస్బీఐ ఉద్యోగాల్లోకి తీసుకోదట

Sbi

SBI: ఇండియాలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… రిక్రూట్మెంట్ నార్మ్స్ లోని నిబంధనలను సవరించింది. దీనిని బట్టి మూడు నెలల కంటే ఎక్కువ నెలల గర్భిణీలను ఉద్యోగాల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఎస్బీఐ రిలీజ్ చేసిన సర్కూలర్ లో 2022 జనవరి 12 తర్వాత మూడు నెలల కంటే ఎక్కువ కాలం గర్భిణీలు అయిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేమని తెలిపింది. ఈ నిర్ణయంతో ఎస్బీఐ కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయినట్లే.

‘మూడు నెలల కంటే తక్కువ ప్రెగ్నెన్సీతో ఉంటే ఫిట్ గా ఉన్నారని పరిగణనలోకి తీసుకోవచ్చు. అదే మూడు నెలల కంటే ఎక్కువైతే వారిని తాత్కాలికంగా అన్ ఫిట్ గానే భావించాలి. వారు డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత జాయిన్ అవ్వొచ్చు’ అంటూ అమెండ్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఈ సర్క్యూలర్ కంటే ముందు ఆరు నెలల గర్భిణీ అయినా ఎస్బీఐ జాయిన్ చేసుకునేది. అది కూడా పిండానికి బ్యాంక్ విధులు ఎటువంటి హాని కలగజేయవని చెప్తేనే రిక్రూట్ చేసుకునే వారు. అక్టోబర్ 2009లో గర్భిణీలను ఉద్యోగాల్లోకి తీసుకోవడంపై నిబంధనలను ఇష్యూ చేశారు.

Read Also : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులతో జాగ్రత్త.. ఇలా రిపోర్ట్ చేయండి..

రీసెంట్ గా తీసుకున్న నిర్ణయంపై యాక్టివిస్టులు మండిపడుతున్నారు. వివక్షతో కూడిన నిర్ణయం అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఇది యాంటీ ఉమెన్ నిర్ణయమే కాదు యాంటీ ఫ్యామిలీ నిర్ణయం అని తిట్టిపోస్తున్నారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారా అంటూ ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ జగమతి సంగ్వాన్ ప్రశ్నిస్తున్నారు