SBI బ్యాంక్ యాప్‌కు కూడా HDFC లాంటి సమస్యలే

SBI బ్యాంక్ యాప్‌కు కూడా HDFC లాంటి సమస్యలే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫాం యోనో యాప్ సిస్టమ్ పనిచేయకుండా పోయింది. పలువురు కస్టమర్లు సమస్య క్లియర్ చేయండి బాబూ అంటూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. YONO లేదా యూ ఓన్లీ నీడ్ వన్ యాప్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాం బ్యాంకింగ్ ఇంటిగ్రేట్ అయి ఉంది.

యోనో ఎస్బీఐ మొబైల్ అప్లికేషన్ పై ప్రస్తుతం సిస్టమ్ అవుటేజ్ సమస్య వచ్చి పడింది. ఆ పనిలోనే ఉన్నాం. క్లియర్ చేస్తామంటూ ఎస్బీఐ స్టేట్ మెంట్ ఇచ్చింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆన్ లైన్ ఎస్బీఐ, యోనో లైట్ బ్యాంకింగ్ సేవలు త్వరలోనే సెట్ చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకుంది.

అనేకమంది కస్టమర్లు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ కు టెక్నికల్ సమస్య వచ్చింది. M005 ఎర్రర్ అనేది కంటిన్యూగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఎస్బీఐకు 490మిలియన్ కస్టమర్లు ఉన్నారు. రోజూ 4లక్షల ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి. ఇందులో 55శాతం బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఇదే డిజిటల్ ఛానెల్ సహాయంతో జరుగుతున్నాయి. బ్యాంక్ యాప్ యోనోకు 27.6మిలియన్ యూజర్లు ఉన్నారు.

We request our esteemed customers to bear with us as we work towards restoring YONO SBI app to provide for an uninterrupted banking experience.#SBI #StateBankOfIndia #ImportantAnnouncement #InternetBanking #OnlineSBI pic.twitter.com/7Qykf85r85
— State Bank of India (@TheOfficialSBI) December 3, 2020

ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగులు పరంగా ఎస్బీఐ అతి పెద్ద కమర్షియల్ బ్యాంక్ గా మారింది. 2020 జూన్ 30 నాటికి రూ.34లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఇదే టెక్నికల్ సమస్యలతో ఇబ్బందిపెడుతుండటంతో కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వొద్దని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎస్బీఐ కూడా టెక్నికల్ సమస్యలు క్లియర్ చేయడం లేదని దీనిపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోండంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపు వినియోగ సేవలను నిషేధిస్తూ ఆర్బిఐ డిసెంబర్ 02న ఉత్తర్వులు జారీ చేసింది. గత 2 సంవత్సరాల్లో HDFC BANK వినియోగదారులకు డిజిటల్ సేవలలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది.