న్యాయమూర్తుల జీతాలు మూడింతలు పెరిగాయి

  • Published By: chvmurthy ,Published On : February 7, 2020 / 06:29 AM IST
న్యాయమూర్తుల జీతాలు మూడింతలు పెరిగాయి

దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.  పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016,  జనవరి 1నుంచి  అమలయ్యేలా చూడాలని సూచించింది.  ఏటా 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పింది.  సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇవి అమలుల్లోకి రావచ్చు. ఆలిండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2017లో ఈ కమీషన్ ను ఏర్పాటు చేసారు.  ఈ కమిషన్‌ తన నివేదికను జనవరి 29న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్‌ దిగువ కోర్టుల్లో జడ్జీల  వ్యవస్థ, పని విధానాలను పరిశీలించింది. తుది నివేదిక ప్రకారం.. జూనియర్‌ సివిల్‌ జడ్జి/ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వేతనాన్ని రూ.27,700 నుంచి రూ.77,840కు పెంచాలి. ఆపై సీనియర్‌ సివిల్‌ జడ్జి వేతనం రూ.1,11,000 లేదా, అంతకంటే ఎక్కువ.. జిల్లా జడ్జీల ప్రారంభ వేతనం రూ.1,44,840 ఉండాలి. జిల్లా జడ్జీల వేతనం గరిష్టంగా రూ.2,24,100 ఉండాలని సూచించింది.
 

హైకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉండి కాలేక పోయిన సెలక్షన్ గ్రేడ్, సూపర్  టైం స్కోల్ జిల్లా జడ్జిలకు వరుసగా 10 శాతం 5 శాతం పెంచాలని సూచించింది. ఉద్యోగి ఫించను తన సర్వీసు  చివరి నెలలో తీసుకున్న వేతనంలో 50 శాతం పింఛనుగా ఇవ్వాలి.  కుటుంబ ఫించను చివరి  వేతనంపై 30 శాతం ఉండాలని సిఫార్సు చేసింది,  అదనపు  పింఛను ఇప్పుడున్న 80 ఏళ్లకు బదులు 75 ఏళ్లకే ఇవ్వాలి. ఆ తర్వాత వివిధ దశల్లో ఆ శాతాన్ని పెంచుకుంటూ పోవాలి.డీఏ 50 శాతానికి చేరినప్పుడు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీపై ప్రస్తుతమున్న సీలింగ్ ను 25 శాతం మేర పెంచాలి. 2004 తర్వాత చేరిన వారికి కొత్త పింఛను విధానం రద్దుచేసి పాత పింధను విధానాన్ని పునరుధ్ధరించాలని కూడా ఆ  నివేదిక లో సూచించారు.