మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. మోడీ,షాలపై అందిన ఫిర్యాదులపై మే-6,2019లోపల నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. 

మోడీ,షాలపై కోడ్ ఉల్లంఘించారంటూ ఇప్పటివరకు 11 కంప్లెయింట్ లు వచ్చాయని,అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై మోడీ,షాలకు క్లీన్ చిట్ ఇచ్చామని,మరో 9 ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందందని, వీటిపై నిర్ణయం తీసుకునేందుకు వచ్చే బుధవారం వరకు సమయం కావాలని విచారణ సందర్భంగా ఈసీఐ సుప్రీంని కోరింది.అయితే మే-6లోపల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.