బిగ్ రిలీఫ్: డ్యాన్స్ బార్లపై ఆంక్షలు సడలింపు

మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్ ఓనర్లకు భారీ ఊరట కలిగింది. డ్యాన్స్ బార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బార్ల యజమానులకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది.

10TV Telugu News

మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్ ఓనర్లకు భారీ ఊరట కలిగింది. డ్యాన్స్ బార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బార్ల యజమానులకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది.

మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్ ఓనర్లకు భారీ ఊరట కలిగింది. డ్యాన్స్ బార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బార్ల యజమానులకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో ముంబైలోని అన్ని డ్యాన్స్ బార్లలో ప్రత్యేక నిబంధనలు విధిస్తూ చట్టాన్ని తెచ్చింది. తద్వారా ‘మహిళల అక్రమరవాణా, మహిళల భద్రత, అసాంఘీక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చట్టంపై బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం విధించిన నిబంధనలతో ముంబై వ్యాప్తంగా 700 వరకు డ్యాన్స్ బార్లు షట్ డౌన్ అయ్యాయి. ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ బార్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రితో కూడిన ధర్మాసనం విచారించింది.

రాత్రి 11.30 డెడ్ లైన్..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను కోర్టు తప్పుబట్టింది. డ్యాన్స్ బార్లలో ఆర్కెస్ట్రాకు మాత్రమే అనుమతి ఇచ్చిన కోర్టు.. డ్యాన్సర్ కు టిప్స్ ఇవ్వొచ్చనని, కానీ, డబ్బులు వెదజల్లడం వంటి చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించింది. డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. సీసీ కెమెరాలు అమర్చడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. డ్యాన్స్‌ పోర్ల దగ్గర మద్యం సరఫరాకు కోర్టు అంగీకరించింది.  సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే డ్యాన్స్‌ బార్లు పని చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది.