Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ప్రధాని నేతృత్వంలోనే ఎంపిక

భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమిటీయే పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు వివరించింది.

Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ప్రధాని నేతృత్వంలోనే ఎంపిక

Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత… ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమిటీయే పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు వివరించింది. భారత ఎలక్షన్ కమిషన్‌లో సంస్కరణలు అవసరమని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా గురువారం తాజా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ తాజా తీర్పును వెల్లడించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవి కుమార్ ఉన్నారు.

Mumbai Division: ముంబైలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే

ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు, ఈసీ మెంబర్స్ ఎంపికలో కొన్ని కీలక మార్పులు అవసరమని బెంచ్ అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో పార్లమెంట్ చట్టం చేసే వరకు ప్రధాని ఆధ్వర్యంలోని కమిటీ పని చేస్తుందని సుప్రీం కోర్టు చెప్పింది. కమిటీలోని ప్రతిపక్ష నేత స్థానంలో విపక్షంలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నేత ఉండాలని సూచించింది. సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేసినట్లుగానే, కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉండాలని, రాజ్యాంగంలోని నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది.