కేంద్రం అలా సుప్రీం ఇలా : Sc, ST  చట్టంపై కీలక నిర్ణయం 

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 09:27 AM IST
కేంద్రం అలా సుప్రీం ఇలా : Sc, ST  చట్టంపై కీలక నిర్ణయం 

Sc, ST  వేధింపుల నిరోధక చట్టం 
విచారణ లేకుండా అరెస్ట్ లు
సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
చట్టం సవరణ ఆమోదం
ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్ 

ఢిల్లీ : Sc, ST  వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణలపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం దుర్వినియోగం అవుతోందనే విమర్శల క్రమంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 

సుప్రీం తీర్పును పట్టించుకోని కేంద్రం..చట్ట సవరణ 
Sc, ST  వేధింపుల చట్టం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతోందని…విమర్శల క్రమంలో కంప్లైంట్ అందిన వెంటనే ఎటువంటి విచారణ లేకుండానే తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును పక్కనబెడుతూ… ఆగస్టు 9న కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ఆమోదించింది. ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మార్చి 20న కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లతో కలపి, అన్ని పిటిషన్ల విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది.