జయ మరణంపై విచారణ..స్టే విధించిన సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 08:40 AM IST
జయ మరణంపై విచారణ..స్టే విధించిన సుప్రీం

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి  శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్‌ లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఆ కేసులో అపోలో డాక్ట‌ర్ల‌ను ఎంక్వైరీ క‌మిష‌న్ విచారిస్తోంది.విచారణలో భాగంగా డాక్ట‌ర్లకు ఆ క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. హాస్ప‌ట‌ల్ రికార్డులు ఇవ్వాలంటూ సృష్టం చేసింది. 
ఈ సమయంలో ద‌ర్యాప్తును నిలిపివేయాల‌ని అపోలో హాస్ప‌ట‌ల్ సుప్రీంని ఆశ్ర‌యించింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అపోల్ వేసిన పిటీష‌న్‌ ను అనుకూలంగా తీర్పునిచ్చింది.ఆర్ముగస్వామి కమిటీ దర్యాప్తుపై స్టే విధించింది. అపోలో అభ్య‌ర్థ‌న‌ను మ‌ద్రాస్ హైకోర్టు తిర‌స్క‌రించ‌డంతో.. ఆ హాస్ప‌ట‌ల్ సుప్రీంని ఆశ్రయించింది.