Uttarakhand: హల్ద్వానీ ఆక్రమణ వ్యవహారంలో ట్విస్ట్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆర్డర్‭పై సుప్రీంకోర్టు స్టే

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించాలని రైల్వే, స్థానిక అధికారులను ఆదేశించింది. ఆక్రమణదారులు భూమిని ఖాళీ చేయకపోతే, పోలీసులు, పారామిలటరీ బలగాలతో సహా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది

Uttarakhand: హల్ద్వానీ ఆక్రమణ వ్యవహారంలో ట్విస్ట్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆర్డర్‭పై సుప్రీంకోర్టు స్టే

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలోని వివాదం కొత్త మలుపుకు తిరిగింది. హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూభాగంలో నివాసం ఉంటున్నారంటూ సుమారు 4,000లకు పైగా కుటుంబాలకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన నోటీసుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. వారం రోజుల్లో 50,000 మంది ఖాళీ చేయడం సాధ్యం అవుతుందా అని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. అంతే కాకుండా భూమిపై చట్టపరమైన హక్కులు పొందుతున్న వారికి పునరావాస పథకాలు, హామీలు కావాలని సుప్రీం సూచించింది.

Viral video: మనిషిని హత్తుకున్న సింహం.. వీడియో చూసి ‘వామ్మో’ అంటున్న నెటిజన్లు

జస్టిస్ ఎస్.కే కౌల్, ఏ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం ఈ విషయమై గురువారం స్పందిస్తూ ‘‘“పూర్తి భూమిని రైల్వేకు అప్పగించాలా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం భూమిలో కొంత భాగాన్ని క్లెయిమ్ చేస్తోందా అనేది పరిశీలించాల్సిన ప్రధాన అంశం. అంతే కాకుండా, ఆక్రమణదారులకు భూమిపై కొనుగోలు హక్కులు ఏమైనా ఉన్నాయా లాంటివి పరిశీలించాలి. 7 రోజుల్లో 50,000 మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి హైకోర్టు ఆర్డర్ మీద మేము స్టే విధిస్తున్నాం. రైల్వేల అవసరాన్ని గుర్తిస్తూ ఇప్పటికే ఉన్న పునరావాస పథకాలతో పాటు, ప్రస్తుతం ఖాళీ చేయిస్తున్నవారికి మరిన్ని ఆచరణీయమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని మేము భావిస్తున్నాం” అని పేర్కొంది.

Cantonment-GHMC : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం..8మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

విషయం ఏంటంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించాలని రైల్వే, స్థానిక అధికారులను ఆదేశించింది. ఆక్రమణదారులు భూమిని ఖాళీ చేయకపోతే, పోలీసులు, పారామిలటరీ బలగాలతో సహా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. హల్ద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్ హృదయేష్ నేతృత్వంలో ఆ ప్రాంత వాసులు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జమాతే ఇస్లామీ హింద్ ఒక ప్రకటన ప్రకారం, వివాదాస్పద స్థలం 29 ఎకరాలు కాగా, 78 ఎకరాల భూమిలో నివసిస్తున్న ప్రజలకు రైల్వే తొలగింపు నోటీసులు అందాయి.