బకెట్ నీళ్లలో లీటర్ పాలు: 80మంది పిల్లలకు పంపిణీ

బకెట్ నీళ్లలో లీటర్ పాలు: 80మంది పిల్లలకు పంపిణీ

ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆహారం పంపిణీ అంటూ ప్రభుత్వం పథకాలు అందిస్తుంటే పిల్లలకు అందేది శూన్యం. ఉత్తరప్రదేశ్‌లో మధ్యాహ్న ఆహార పథకం కింద రోటీలు పంచిబెట్టిన వైనంపై అధికారులు తీసుకున్న చర్యలు బేఖాతరు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సాధారణ చెకింగ్‌లో బుధవారం విద్యార్థులకు పాలు పంపిణీ చేసే సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు అక్కడికి వెళ్లారు. 

పెద్ద అల్యూమినియం పాత్రలో బకెట్‌ వేడి నీళ్లతో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఆ విషయాన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాఠశాల సిబ్బందిని అడగగా పాలు పంపిణీ చేయడానికి గేదెలు, ఆవులు లేవని తెలిపారు. పాల ప్యాకెట్ల సరఫరా ఆలస్యమైన కారణంగానే తప్పిదం జరిగిందని చెప్పుకొచ్చారు. అదే రోజు ఆ తర్వాత పిల్లలందరికీ పాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 

ఒక ప్యాకెట్‌ పాలు ఇచ్చారని.. అందుకే వాటిని సమానంగా పంచేందుకు నీళ్లు పోయాల్సివచ్చిందని అని చెప్పింది వంటమనిషి . రెండు నెలల క్రితం మీర్జాపూర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం-ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు బయటపెట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారును తిట్టిపోశారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే కుట్ర పన్నాడంటూ పోలీసులు తిరిగి కేసు నమోదు చేశారు.