ఇవే తినాలి : మధ్యాహ్న భోజనంలో రొట్టె, ఉప్పు

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 05:35 AM IST
ఇవే తినాలి : మధ్యాహ్న భోజనంలో రొట్టె, ఉప్పు

పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ చిన్నారులకు సరియైన ఆహారం అందడం లేదు. కొంతమంది కక్కుర్తి పడి వారికి సరియైన భోజనం పెట్టకుండా డబ్బులు నొక్కేస్తున్నారు. అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకారం ఇవ్వడం లేదు. కేవలం రొట్టె..ఉప్పు పెడుతున్నారు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటు చేసుకుంది. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది. కానీ మీర్జాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది ఏమి పట్టించుకోవడం లేదు. పథకంలో పేర్కొన్న విధంగా భోజనం ఇవ్వడం లేదు. కేవలం రొట్టె..ఉప్పు ఇచ్చి తినమంటున్నారు. మరుసటి రోజు అన్నం..ఉప్పు..ఇలా వారమంతా చిన్నారులకు అందిస్తున్నారు. 

Read More : చొరబడిన ఉగ్రవాదులు : తమిళనాడులో హై అలర్ట్
గత ఏడాదికాలంలో ఈ స్కూల్లో పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారని, పాలు వచ్చినా..ఇవ్వరని..అరటి పండ్లు ఇంతవరకు ఇవ్వలేదని ఓ జాతీయ సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ దారుణమైన ఘటన బయటకు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరిపై వేటు వేశారు అధికారులు.