రేపటి నుంచే.. అన్‌లాక్-4.0 : స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు

  • Published By: vamsi ,Published On : September 20, 2020 / 10:56 AM IST
రేపటి నుంచే.. అన్‌లాక్-4.0 : స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు

కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్‌లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే సెప్టెంబర్ 21 వ తేదీ నుంచి దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ తరువాత, భారతదేశం ఇప్పుడు అన్‌లాక్ నాల్గవ దశలో ఉంది.

సెప్టెంబర్ 21న ఈ దశ ప్రారంభం అవుతుండగా.. అంటే రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తెరవబడతాయి. వీటితో పాటు, భారతీయ రైల్వే కూడా ప్రయాణీకుల సౌలభ్యం కోసం రేపటి నుంచి 40 కొత్త రైళ్లను నడుపుతుంది. రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు, రైల్వేతో సహా మొత్తం నాలుగు కొత్త మార్పులను అమలు చేయబోతున్నారు. ఇవన్నీ కరోనా కాలంలో జరుగుతున్న ప్రధాన మార్పు

పట్టాలెక్కుతున్న రైళ్లు:
రేపటి నుంచి రైల్వేలో పెద్ద మార్పు కనిపిస్తుంది. లాక్‌డౌన్ తరువాత, రైల్వే ఇప్పుడు నెమ్మదిగా రైళ్లను నడపడం ప్రారంభించగా.. రైల్వే 80 ప్రత్యేక రైళ్లను ఇంతకుముందే ప్రారంభించింది. ఇప్పుడు సెప్టెంబర్ 21 న అంటే రేపటి నుంచి మరో 40 కొత్త రైళ్లను నడుపుతుంది. ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.


రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలు, కళాశాలలు:
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాల కళాశాలలు ఆరు నెలలకు పైగా మూసివేశారు. అయితే రేపటి నుంచి పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించవచ్చు. ప్రస్తుతానికి, మునుపటిలా తరగతులు జరగవు, కాని పిల్లలు కౌన్సెలింగ్ కోసం తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు వెళ్ళవచ్చు. అన్‌లాక్ 4.0 మార్గదర్శకంలో, సెప్టెంబర్ 21 నుండి 9 మరియు 12 తరగతులను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కంటైన్మెంట్ లేని జోన్లలో మాత్రం పాఠశాలలకు అనుమతి లేదు. పాఠశాలలు తెరవడానికి, పాఠశాల పరిపాలన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించాలి. దేశ రాజధానిలో మాత్రం విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి మరో 15 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. కరోనా పెరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 5 వరకు పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది.

పర్యాటకుల కోసం తెరుచుకున్న తాజ్ మహల్:
కరోనా కారణంగా తాజ్ మహల్ పర్యాటకులకు ఆరు నెలలుగా మూసివేయబడింది, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అన్‌లాక్-4.0లో తిరిగి తెరవాలని నిర్ణయించారు. తాజ్ మహల్‌తో పాటు, ఆగ్రా కోటను కూడా పర్యాటకులు చూడగలరు. అయితే, తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట రెండింటికి పర్యాటకుల సంఖ్య పరిమితం అవుతుంది. ఐదు వేల మంది సందర్శకులు మాత్రమే తాజ్ మహల్ చూడటానికి వెళ్ళగలుగుతారు, ఆగ్రా కోట పరిమితి 2500. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల బుకింగ్ జరుగుతుంది.