30శాతం విద్యార్ధులతోనే స్కూళ్లు ప్రారంభం!

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 03:45 PM IST
30శాతం విద్యార్ధులతోనే స్కూళ్లు ప్రారంభం!

కోవిడ్-19 లాక్ డౌన్ ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి క్లాస్ రూమ్స్ కు చేరుకున్న తర్వాత పాఠశాలలు ఒకేసారి 30 శాతం మందితో మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. తరగతులను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన గైడ్ లైన్స్ ను తాను టీచర్లకు సూచించినట్లు రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. 

కరోనా నేపథ్యంలో మార్చి రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు,యూనివర్శిటీలు మూసివేయబడిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పాఠశాలలు… సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడానికి ఒకేసారి 30 శాతం విద్యార్థులను మాత్రమే పిలవనున్నాయి.

ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లతో మాట్లాడిన పోఖ్రియాల్ మాట్లాడుతూ…స్కూల్స్ ను తిరిగి తెరవడానికి మార్గదర్శకాలను సిద్దం చేయాలని NCERTని కోరాము. వారు చాలా వరకు పని పూర్తి చేశారు. ఒకే సారి 30శాతం మంది విద్యార్థులు స్కూల్ కు హాజరవడం వంటి వివిధ గైడ్ లైన్స్ ను సూచించారు. ఒకేసారి 30శాతం మంది విద్యార్థులను స్కూల్ కి పిలవవలసివస్తే..అది ఎలా పనిచేయాల్సిన అవసరముందో చూడాలన్నారు.
పాఠశాలల్లో షిఫ్ట్ వ్యవస్థ?
అస్థిర అటెండెన్స్ సిస్టమ్ ను ఉపసంహరించుకోవటానికి కౌన్సిల్ రెండు మార్గాలను సూచించినట్లు ఎన్‌సిఇఆర్‌టిలోని అధికారులు తెలిపారు. కొంతమంది విద్యార్థులను ఒక రోజు మరియు మిగిలిన రోజులలో పిలవడం, లేదా సాధ్యమైన చోట షిఫ్టులలో నిర్వహించడం. పాఠశాలలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే దానిపై ప్రభుత్వం నుండి స్పష్టత లేకపోగా, ఢిల్లీ వంటి రాష్ట్రాలు పాఠశాలలను జులైలో తిరిగి తెరవాలని చూస్తున్నాయి.

 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ వారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జూలైలో విద్యార్థులను తిరిగి తరగతి గదుల్లో చూడగలనని భావిస్తున్నట్లు చెప్పారు. జూలైలో పిల్లలను తిరిగి పాఠశాలకు ఆహ్వానించగలమని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఏదైనా కారణం చేత మరింత ఆలస్యం జరిగితే ఆకస్మిక ప్రణాళికలపై యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు సిసోడియా తెలిపారు.