Omicron Threat: ఒమిక్రాన్ ముప్పు.. స్కూళ్లు ప్రారంభం.. తల్లిదండ్రులు ఏమంటున్నారు?

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్‌స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.

Omicron Threat: ఒమిక్రాన్ ముప్పు.. స్కూళ్లు ప్రారంభం.. తల్లిదండ్రులు ఏమంటున్నారు?

Schools

Maharashtra School: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్‌స్మిషన్ స్థాయిలో ఉండగా.. ఇదే సమయంలో మహారాష్ట్రలో స్కూళ్లు తెరిచింది ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం. రాష్ట్రంలో నేడు(24 జనవరి 2022) 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

పాఠశాలల్లో ఆఫ్‌లైన్ విద్య ఇవాళ నుంచి ప్రారంభం కానుండగా.. కోవిడ్ నిబంధనలను అనుసరించి పాఠశాలల్లో చదువులు సాగనున్నాయని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, మూడో వేవ్ సాగుతున్న సమయంలో ఉద్ధవ్ ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించడానికి తొందరపడుతుందనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. మెజారిటీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అంగీకరించట్లేదు. ఓ సర్వే ప్రకారం, 62 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడట్లేదు.

ఆన్‌లైన్ ఏజెన్సీ లోకల్ సర్వీసెస్ సర్వే ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు కరోనా సోకుంతుందేమోననే భయంతో వాళ్లను స్కూళ్లకు పంపేందుకు ఇష్టపడట్లేదు తల్లిదండ్రులు. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు.

Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

సర్వే ప్రకారం, మహారాష్ట్రలో 62 శాతం మంది తల్లిదండ్రులు జనవరి 24 నుంచి తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు. అదే సమయంలో, 11 శాతం మంది తల్లిదండ్రులు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. సర్వేలో, టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4976 మంది పాల్గొన్నారు.

SOPని సరిగ్గా పాటించకుంటే ప్రమాదమే..
పిల్లల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి పాఠశాలకు వెళ్లడం చాలా ముఖ్యం. కానీ, స్కూళ్లు అన్ని SOPలను సరిగ్గా అనుసరిస్తే, పిల్లలకు ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా SOP అనుసరించడం కష్టం అనే అభిప్రాయం ఉంది.

పిల్లలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరియని, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుతూ ఉండాలని, ఇదంతా అసాధ్యం అని అంటున్నారు. ఇక పాఠశాలల్లో 50శాతం మంది పిల్లలే హాజరు కావాలి. పాఠశాల వ్యాన్‌లో 50శాతం మంది పిల్లలు ఉండాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామాజిక దూరం పాటించాలి.

పాఠశాలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ విషయాలన్నింటిపై శ్రద్ధ వహించాలి. ఈ నిబంధనలు పాంటించకుంటే మాత్రం ప్రస్తుత పరిస్థితిలో పిల్లలకు ప్రమాదమే.