Schools fees : ఆ ఖర్చులు మిగులుతున్నాయిగా..Online క్లాసులకు స్కూల్స్ ఫీజులు త‌గ్గించండి : సుప్రీం ఆదేశాలు

స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులుమాత్రమే నిర్వహిస్తే విద్యార్ధుల నుంచి వసూలు చేసే ఫీజులు తగ్గించాలని సుప్రీంకోర్టు ప్రవైటే,కార్పొరేట్ స్కూళ్ల యాజామాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలు, డీజిల్, కరెంట్, వాటర్ బిల్స్ ఖర్చులు మిగులుతున్నాయి కాబట్టి స్కూల్ ఫీజులు తగ్గించాలని సూచించింది.

Schools fees : ఆ ఖర్చులు మిగులుతున్నాయిగా..Online క్లాసులకు స్కూల్స్  ఫీజులు త‌గ్గించండి : సుప్రీం ఆదేశాలు

Online Class School Fre

Schools must reduce fees : కరోనా వల్ల ఆన్ లైన్ క్లాసులకే పరిమితమవతున్నారు విద్యార్ధులు. అయినా సరే పూర్తి ఫీజులు కట్టాల్సిందేనంటూ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్ధుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు కరోనాతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కట్టటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తే విద్యార్దుల నుంచి వసూలు చేసే ఫీజులు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.

సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఈ ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ వల్ల స్కూల్స్ కు కొన్ని ఖర్చులు మిగిలినట్లే. స్కూల్ వ్యాన్లుకు అయ్యే పెట్రోల్, డీజిల్ ఖర్చులతో పాటు స్కూల్స్ మూసివేయటంతో వ్యాన్ డ్రైవర్లను కూడా ఉద్యోగాల్లోంచి తీసివేశాయి స్కూల్ యాజమాన్యాలు. దీంతో ఆ ఖర్చులు కూడా తప్పినట్లే. పైగా స్కూల్ నిర్వాహణకు అయ్యే ఖర్చులు కూడా మిగులుతున్నాయి. అయినా సరే విద్యార్ధులు పూర్తి ఫీజులు కట్టాల్సిందేనని కొన్ని స్కూల్స్ విద్యార్దుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈక్రమంలో స్కూల్ నిర్వహణ ఖర్చులు తగ్గాయని దేశ అత్యున్నత ధర్మాసనం గుర్తు చేసింది. కాబట్టి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే స్కూల్స్ ఫీజులు తగ్గించాల్సిందేనని ఆదేశించింది.

కరోనా కార‌ణంగా విద్యార్దుల తల్లిదండ్రులకు వచ్చిన ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని సూచించింది. విద్యార్థుల‌ు ఇళ్లనుంచే ఆన్ లైన్ ద్వారా పాఠాలు వింటుంటే..స్కూలు వాళ్లకు అందించని సౌకర్యాలకు కూడా ఫీజులు వసూలు చేయటం సరికాదని..ఇలా చేయటం కేవలం ధనార్జన మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఇటువంటి లాభాలను ఆశించడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.

ఇక గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు పెట్రోల్, డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, వాటర్ ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు, ఆయాలు, వ్యాను డ్రైవర్ జీతాలు వంటి అనేక ఖర్చులు మిగులుతున్నాయి. ఇటువంటివాటిని దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం స్కూళ్లకు స్ప‌ష్టం చేసింది.

స్కూళ్ల ఫీజుల వసూళ్ల పరిస్థితి ఇలా ఉంటే..మరోపక్క ఆన్ లైన్ క్లాసులు త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారాయి. అలాగే ఈ ఆన్ లైన్ క్లాసులు స్కూళ్ల‌కు భారీగా ఖ‌ర్చులు తగ్గించాయి. అయినా సరే ఫీజులు విష‌యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు.. కేవ‌లం ఆన్‌లైన్ క్లాసులే అయితే క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే అని స్ప‌ష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌ల కార‌ణంగా స్కూలు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గాయి కాబ‌ట్టి ఆ ప్ర‌యోజ‌నాన్ని త‌ల్లిదండ్రుల‌కు బ‌దిలీ చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పింది.