Schools: ఫిబ్రవరి 15 వరకు పాఠశాలలు మూసివేత

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే యూపీలో విద్యా సంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

Schools: ఫిబ్రవరి 15 వరకు పాఠశాలలు మూసివేత

Schools (2)

Schools: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే యూపీలో విద్యా సంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది అక్కడి యోగి ప్రభుత్వం. ఆన్‌లైన్ తరగతులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

గతంలో పెరిగిన కరోనా కేసుల మధ్య, జనవరి 30వ తేదీ నాటికి ఉత్తరప్రదేశ్‌లోని విద్యా సంస్థలను మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతకుముందు జనవరి 23వ తేదీ వరకు మాత్రమే పాఠశాలలు కళాశాలను మూసివేయాలని ప్రభుత్వం భావించింది.

Dil Raju : ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు, హరీష్ శంకర్

అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేసింది. యూనివర్సిటీ-కాలేజీ సెమిస్టర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడగా.. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది.