Schools ReOpen: కరోనా తగ్గుముఖం.. పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.

Schools ReOpen: కరోనా తగ్గుముఖం.. పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

Schools

Schools ReOpen: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 9 నుంచి 12వ తేదీ వరకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా డిసెంబర్‌లో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, స్పాలు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి.

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయకుండా.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే నైట్ కర్ఫ్యూ ఉండేలా ప్లాన్ చేశారు. ఆన్‌లైన్ టీచింగ్ ఆప్షన్ కారణంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పుడు హాజరు శాతం తక్కువగా ఉందని, ప్రత్యక్ష తరగతులను పూర్తిగా పునరుద్ధరించకపోతే నష్టం తప్పదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.

ఈ క్రమంలోనే నేటి నుంచి అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతులను ప్రారంభిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్‌లను కూడా తిరిగి తెరవాలని నిర్ణయించారు. దీంతో పాటు ఫిబ్రవరి 14 నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు తరగతులను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.

బీహార్, గుజరాత్, కేరళతో సహా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వెంటనే స్కూళ్లను ప్రారంభించాలని, స్కూళ్లలో మాస్క్‌లు ధరించేలా చూసేందుకు, కరోనా నిబంధనలు విద్యార్ధులు పాటిస్తున్నారో లేదో చూసేందుకు కూడా ఓ మనిషిని పర్యవేక్షణకు పెట్టుకోవడం కూడా అవసరం అని అభిప్రాయపడుతున్నారు.