HIV Vaccine Clinical Trials : హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు పడింది. హెచ్ ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వియవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు.

HIV Vaccine Clinical Trials : హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

HIV vaccine (2)

HIV Vaccine Clinical Trials : హెచ్ఐవీ ప్రాణాంతక వ్యాధి.. దీనికి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం. హెచ్ఐవీ బారినపడి ఏటా వేల మంది మరణిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ అందించారు. హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు పడింది. హెచ్ ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వియవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు.

ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ వాలంటీర్లలో యాంటీబాడీలను మెరుగ్గా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ రెండు డోసుల వ్యాక్సిన్ 8 వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్ఐవీలో ఉండే ఓ ప్రొటీన్ ఇంజినీరింగ్ వెర్షన్ తో ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

HIV-AIDS: హెచ్ఐవీకి చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు

ఈ వ్యాక్సిన్ హెచ్ ఐవీ విభిన్న జాతులను గుర్తించగలిగే యాంటిబాడీలను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా సంక్రమణం నుంచి రోగికి రక్షణ కల్పిస్తుందని వివరించారు.