Scribbling on Bank Note : కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర్బీఐ ఏం చెబుతోంది? అందులో నిజమెంత? దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

Scribbling on Bank Note : కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర్బీఐ ఏం చెబుతోంది? అందులో నిజమెంత? దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

Also Read..Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి

కరెన్సీ నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అలాంటి ప్రకటనల్లో నిజం లేదని కొట్టిపారేసింది. నోట్లపై రాతలు ఉంటే చెల్లవని ఇటీవల ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చిందంటూ ఓ ఫేక్ నోట్ వైరల్ అయ్యింది. దీంతో అలజడి రేగింది. గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అలాటి గైడ్ లైన్స్ ఏవీ ఆర్బీఐ ఇవ్వలేదని అందులో పేర్కొంది. కాకపోతే నోట్లు త్వరగా పాడవకుండా ఉండేందుకు ఎలాంటి రాతలు రాయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు