Zomato IPO: జొమాటో ఐపీఓ అప్లికేషన్‌కు సెబీ ఆమోదం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI).. జొమాటో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)అప్లికేషన్ కు ఆమోదం తెలిపింది. 2021లో ఇంటర్నెట్ కంపెనీ ప్లానింగ్ చేసిన ఐపీఓలలో..

Zomato IPO: జొమాటో ఐపీఓ అప్లికేషన్‌కు సెబీ ఆమోదం

Sebi Clears Ipo Application Of Zomato

Zomato IPO: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI).. జొమాటో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)అప్లికేషన్ కు ఆమోదం తెలిపింది. 2021లో ఇంటర్నెట్ కంపెనీ ప్లానింగ్ చేసిన ఐపీఓలలో జొమాటో బాగా ఆతురతగా ఉంది. ఐపీఓ ద్వారా 750 మిలియన్ డాలర్లను సేకరించాలనే లక్ష్యంతో జొమాటో ఉంది.

రూ.8వేల 250కోట్ల ఈక్విటీ షేర్ వాల్యూ.. ఒక్క రూపాయి నుంచి మొదలవనుంది. కొద్ది నెలల క్రితం.. జొమాటో ఐదు ఇన్వెస్టర్ల నుంచి 250 మిలియన్ డాలర్లను సేకరించింది. ఇందులో కోరా మేనేజ్‌మెంట్ ఎల్‌పీ నుంచి 115 మిలియన్ డాలర్లను సేకరించగా… ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ కంపెనీ తన అనుబంధ సంస్థల నుంచి మరో 55 మిలియన్ డాలర్లు సేకరణ చేపట్టింది.

ఇక టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుంచి 50 మిలియన్ డాలర్లు చేపట్టగా, 20 మిలియన్ డాలర్లు బో వేవ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ నుంచి సేకరించింది. డ్రాగనీర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ నుంచి 10 మిలియన్ డాలర్లు సేకరించింది. ప్రస్తుతం జొమాటో నుంచి 18.4శాతం స్టాక్ మాత్రమే ఎఫెక్టివ్ గా ఉండనుందని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.