Adani : అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు

అదానీ గ్రూప్ కు విషయంపై పార్లమెంట్ లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద్రీ స్పందించారు. ఈ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టడం జరిగిందని, నిబంధన అమలు తీరుపై సీబీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లు అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలపై దృష్టి పెట్టాయని వెల్లడించారు.

Adani : అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు

Adani

SEBI Investigating Adani Group : అదానీ గ్రూప్ కు విషయంపై పార్లమెంట్ లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద్రీ స్పందించారు. ఈ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టడం జరిగిందని, నిబంధన అమలు తీరుపై సీబీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లు అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలపై దృష్టి పెట్టాయని వెల్లడించారు. 2021, జూలై 19వ తేదీ సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో మంత్రి పంకజ్ చౌద్రీ చేసిన ప్రకటనతో ఆ గ్రూప్ షేర్ లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రోజువారీ షేర్ల ట్రేడింగ్ FPI పాత్రపై దర్యాప్తు చేయడం లేదని మంత్రి పంకజ్ వెల్లడించారు. అదానీ గ్రూప్ లో ఆరు లిస్టెడ్ కంపెనీలున్నాయని, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్ కంపెనీల షేర్లు ట్రేడవుతున్నాయి. అయితే..ఈ కంపెనీల్లో మూడు విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింప చేసినట్లు వార్తలు రావడంతో గత నెలలో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

దీంతో అదానీ నికర సంపద 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 55 వేల కోట్లు) ఆవిరైపోయింది. మారిషస్ కు చెందిన ఆరు పెట్టుబడి సంస్థలు తమ పెట్టుబడి మొత్తాల్లో అధిక భాగం అదానీ గ్రూపు షేర్లలో పెట్టుబడి పెట్టడం..అందులో మూడు సంస్థల షేర్లను ఫ్రీజ్ చేశారనే ఆరోపణలు రావడంతో అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. షేర్ల విషయంలో అదానీ స్పందించారు. వాస్తవాలను వక్రీకరించారని వెల్లడించారు. అదానీ