రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 12:19 PM IST
రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రెండో జాతీయ రాజధాని ఏర్పాటు అంశం  పరిశీలనలో లేదని వెల్లడించారు. 
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని, దేశానికి రెండో రాజధానిగా చేస్తారంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటిస్తే..కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అంతేగాకుండా..ఢిల్లీలో అధిక కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఇలాంటి వాదనలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రంలో లేని ప్రకృతి సమతుల్యత హైదరాబాద్‌ నగరానికి ఉండడం, భూకంపాలు కూడా పెద్దగా సంభవించని ప్రాంతం కాబట్టి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తే బెటర్ అనే వాదనలు వినిపించాయి. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు కూడా అంతగా తేగిగ్గా చొరబడ లేరని, జలమార్గం లేని హైదరాబాద్ రాజధానిగా అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటుందని పెద్దలు అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
Read More : GST చెల్లింపుదారులకు లాటరీ పథకం!