Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్ గాంధీవైపు దూసుకొచ్చి కౌగిలించుకున్న యువకుడు..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్ గాంధీవైపు దూసుకొచ్చి కౌగిలించుకున్న యువకుడు..

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ వ్యక్తి యాత్రలో అలజడి సృష్టించాడు. రాహుల్ భద్రతా వలయాన్ని దాటుకొని రాహుల్ వైపు దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా రాహుల్ ను కౌలిగించుకున్నాడు. ఒక్కసారిగా కంగుతిన్న రాహుల్ గాంధీ.. యువకుడ్ని నెట్టే ప్రయత్నం చేశాడు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది యువకుడిని పక్కకు తీసుకెళ్లాయి.

Bharat Jodo Yatra: పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ వైపుకు యువకుడు దూసుకురావడంతో పాటు కౌగిలించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. రాహుల్ గాంధీ భద్రత విషయంపై అమిత్‌షాకు లేఖ రాసినప్పటికీ పూర్తిస్థాయి భద్రత కల్పించక పోవటంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం

రాహుల్ గాంధీ భద్రత విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెండు సార్లు హోమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. అయితే రాహుల్ గాంధీ భద్రతలో నిమగ్నమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేక సందర్భాల్లో రాహుల్ స్వయంగా మార్గదర్శకాలు ఉల్లంఘించారని చెప్పారు. సీఆర్పీఎఫ్ నుంది వచ్చిన స్పందనపట్ల కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేడా మండిపడ్డారు.