Hybrid Terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు “హైబ్రీడ్” టెర్రరిస్టులను పట్టుకున్న భద్రతా బలగాలు

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో ఆదివారం భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు హైబ్రీడ్ ఉగ్రవాదులు పట్టుబడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Hybrid Terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు “హైబ్రీడ్” టెర్రరిస్టులను పట్టుకున్న భద్రతా బలగాలు

Jk Police

Hybrid Terrorists: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. భద్రతా దళాల కళ్లుగప్పి..కలుగులో నక్కి ఉన్న ఉగ్రవాదులను..మట్టుపెడుతున్నారు భారత భద్రతా దళాలు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో ఆదివారం భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు హైబ్రీడ్ ఉగ్రవాదులు పట్టుబడినట్లు అధికారులు పేర్కొన్నారు. భారత ఆర్మీ, కుల్గామ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన చెందిన యామిన్ యూసఫ్ భట్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఇతను గడిహమా కుల్గామ్‌కు చెందినవాడిగా కుల్గామ్ పోలీసులు గుర్తించారు. ఉగ్రవాది యామిన్ యూసఫ్ భట్ నుంచి ఒక పిస్టల్, రెండు గ్రెనేడ్‌లు మరియు 51 రౌండ్‌ల బుల్లెట్లు సహా ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also read:Venkaiah Naidu: మరోసారి విశ్వ విజ్ఞాన కేంద్రంగా భారత్: వెంకయ్య నాయుడు

శ్రీనగర్ జిల్లా నౌగామ్ లో జరిపిన దాడుల్లో మరో హైబ్రీడ్ ఉగ్రవాదిని శ్రీనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు నౌగామ్ లోని మౌచ్వాకు చెందిన షేక్ షాహిద్ గుల్జార్ గా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాది షేక్ షాహిద్ గుల్జార్ నుంచి ఒక పిస్టల్ మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఒక పని నిమిత్తం ఒకరినే నియమించుకుంటారు..వారిలో ప్రణాళిక రచించే వారు కొందరు ఉంటే..దాన్ని అమలు పరిచేవారు మరొకరు ఉంటారు. అయితే ఒక ‘హైబ్రిడ్ టెర్రరిస్ట్’లు తమకు ఇచ్చిన పనిని నిర్వర్తించి, తదుపరి అసైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ.. రోజు వారి పనులు చక్కబెట్టుకుంటారని అధికారులు వివరించారు.