Security Forces: ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చుతున్న ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి దళాలు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.

Security Forces: ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

Security Forces Seize Explosives

Security Forces: భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చుతున్న ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి దళాలు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా త్రాల్ సమీపంలోని ఓ పండ్లతోటలో పేలుడు పదార్ధాలు ఉన్నాయని రాష్ట్రీయ రైఫిల్స్‌ కి సమాచారం అందింది. దీంతో తోటలోకి వెళ్లిన రాష్ట్రీయ రైఫిల్స్‌ బృందం ఐదు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు.

ఇక ఈ విషయంపై స్థానిక పోలీసులు మీడియాతో మాట్లాడారు. దక్షిణ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను భద్రతాదళాలు సమర్థవంతంగా ఎదురుకుంటున్నాయని తెలిపారు. తాజాగా ఓ ఐఈడీని కూడా నిర్వీర్యం చేసినట్లు వివరించారు పోలీసులు.