Elephant : తెలివైన ఏనుగు.. స్ప్రింక్లర్ నీటిని ఎలా తాగుతుందో చూడండి

Elephant : తెలివైన ఏనుగు.. స్ప్రింక్లర్ నీటిని ఎలా తాగుతుందో చూడండి

Elephant

Elephant : అప్పుడప్పుడు జంతువులు చేసే కొన్ని పనులు మనుషులకు మంచి కాలక్షేపం ఇస్తాయి. చాలా మంది జంతువులు చేసే పనులను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఒక్కోసారి జంతువులు మనుషులకంటే తెలివిగా ప్రవర్తిస్తుంటాయి.. ఇక ఇవి చేసే వింత పనుల వీడియోలను చూసి ఆనందిస్తుంటారు కొందరు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

అవి చేసే పనులను ఎవరో ఒకరు తీసి నెట్టింట్లో పెడితే అవి లక్షల్లో లైకులు, వేలలో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా నెట్టింలో ఏనుగులకు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 23 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియో లో ఓ ఏనుగు స్ప్రింక్లర్ నుంచి వస్తున్న చల్లని నీటిని తాగుతుంది. తొండంతో నీటిని పట్టి తాగేస్తుంది.. ఇక ఓ ఏనుగు నీటిని తాగుతుండగా మరో ఏనుగు, నిరీక్షిస్తుంది.

దీనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఆలా ఎన్నిరోజులు తాగుతావ్.. దాంతో నీ పొట్ట నిండాలంటే ఏడాది పడుతుందని కొందరు అంటే.. నీ తెలివికి హాట్స్ అప్ అని మరికొందరు అంటున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే 16000 వ్యూస్ రాబట్టింది.