Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్.. అధికార బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేక సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సీఎం పీఠం ఎక్కుతారా?

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ?

Priyanka-Gandhi

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్.. అధికార బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేక సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సీఎం పీఠం ఎక్కుతారా? లేక మరో కొత్త ముఖం ఎన్నికల్లో నెగ్గుతారా? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నాయి.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సీఎంగా తానే పోటీలో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, మహిళలకు ఉపాధి, వ్యాపారాలు కల్పించేందుకు యూపీ ప్రజలను ఆకట్టుకునేలా మ్యానిఫెస్టోని తయారు చేసింది కాంగ్రెస్.

ఓట్లు రాబట్టే ఏ అవకాశాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. ఈ సమయంలోనే యూపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రియాంక గాంధీ.. తానే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అన్న విషయంపై మాత్రం ప్రియాంక క్లారిటీ ఇవ్వలేదు.

యువజన కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో ప్రజాకర్షక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్. యూపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందులో 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్ కింద ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. రిక్రూట్‌మెంట్‌ చట్టంలోని ఐదు విభాగాల్లో యువత ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ పేర్కొంది.

ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని పార్టీ స్పష్టంచేసింది. సెకండరీ, ఉన్నత విద్య, పోలీసు తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. సంస్కృత టీచర్, ఉర్దూ టీచర్, అంగన్‌వాడీ, ఆశా తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది కాంగ్రెస్.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా అన్ని పరీక్షలకు ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ చెబుతుంది. పరీక్షల సమయంలో బస్సు, రైలు ప్రయాణం ఉచితం చేయనున్నట్లు ప్రకటించింది.