Turmeric : పసుపులో విత్తనాల ఎంపిక , శుద్ధి

సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ విత్తనాన్ని రైతులు వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని, పెద్ద కొమ్ములను అలాగే వైస్తుండటంతో

10TV Telugu News

Turmeric : భారత దేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు ప్రధానమైనది. మన దేశంలో సగానికి సంగం పసుపు పంట తెలుగు రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేసిన పసుపు పంట చివరకు రాబడి తగ్గుతుండటం రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంది. విత్తనాల ఎంపిక, మోతాదు , విత్తన వుద్ది, విత్తుకునే పద్దతులు , ఎరువుల యాజమాన్యం , సస్యరక్షణ చర్యలు వంటి అంశాలను రైతులు సక్రమంగా పాటిస్తే అవరోధాలను అధిగమించి మంచి ఫలసాయం పొందేందుకు వీలుంటుంది.

విత్తనాల ఎంపిక ; చాలా మంది రైతులు నేటికి దిగుబడి సామర్ధ్యం తక్కువగా, కర్క్యుమిన్ శాతం తక్కువగా ఉండే దీర్ఘకాలిక రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. నూతన రకాలైన స్వల్పకాలిక , అధిక దిగుబడి సామర్ధ్యంతోపాటు, కర్క్యుమిన్ శాతం ఎక్కువ కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవటం మంచిది. ఇవి తెగుళ్ళను తట్టుకుని తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పంట చేతికందిన తరువాత మరో పప్పుజాతి పంట వేసుకుని అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.

విత్తన మోతాదు ; సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ విత్తనాన్ని రైతులు వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని, పెద్ద కొమ్ములను అలాగే వైస్తుండటంతో విత్తన మోతాదు ఎక్కవగా అవసరమౌతుంది. రైతులు క్వింటా విత్తన పసుపును 3500 నుండి 4వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు ఖర్చు అధికమౌతుంది. వంటి కన్ను ముచ్చె ఉన్న కొమ్ములను ముక్కలుగా కోసి ప్రతి ముక్కలో రెండు లేదా మూడు మొగ్గలు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే ఎకరానికి 2 నుండి 3క్వింటాళ్ళ విత్తనం సరిపోతుంది. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.

విత్తన శుద్ధి ; పసుపులో వచ్చే చీడపీడల్లో దుంపపుచ్చు, దుంపకుళ్లు వంటివి ముఖ్యమైనవి. పసుపు విత్తనాన్ని శుద్ధి చేసుకుని నాటుకుంటే చీడపీడల ఉధృతిని నుండి తొలిదశలోనే పంటను కాపాడుకోవచ్చు. వి్తన శుద్ధి కోసం లీటరు నీటికి రిడోమిల్ ఎం.జ.డ్ 2మి.లీ మరియు క్లోరోఫైరిఫాస్ 2మి.లీ లేదా ఇమిడా క్లోప్రిడ్ 0.3మి.లీ చొప్పున ద్రావణాన్ని తయారు చేసుకుని అందులో కత్తిరించిన ఒంటి కన్ను ముచ్చెలను 45 నిమిషాలపాటు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టాలి. అనంతరం ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రనాశినితో దుంపలను శుద్ధి చేసుకోవాలి. తద్వారా విత్తనం ద్వారా వ్యాప్తి చెందే దుంపపుచ్చు, దుంపకుళ్లు తెగుళ్ళ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల రైతులు తగ్గువ ఖర్చుతో మంది అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.

×