Self-Made Rich List 2020 : పిన్న వయస్సులో భారత యువ బిలియనీర్లు వీరే..

  • Published By: sreehari ,Published On : October 21, 2020 / 04:59 PM IST
Self-Made Rich List 2020 : పిన్న వయస్సులో భారత యువ బిలియనీర్లు వీరే..

Self-Made Rich List 2020 : అతి పిన్న వయస్సులోనే బిలియనీర్ల స్థాయికి ఎదిగారు. స్వయం నిర్మిత పారిశ్రామికవేత్తలుగా కేవలం 40 ఏళ్ల లోపు వయస్సులోనే బిలియనీర్లుగా ఎదిగి భారతీయ యువ కుబేరులుగా అవతరించారు.

భారతీయ యువ సంపన్న పారిశ్రామికవేత్తల టాప్ 10 జాబితాను IIFL Wealth, Hurun India 40 & Under Self-Made Rich List 2020 విడుదల చేశాయి.

భారతదేశంలో అతి పిన్న వయస్కులైన స్వయం నిర్మిత పారిశ్రామికవేత్తలను టాప్ 10 జాబితాలో 16 పేర్లతో విడుదల చేసింది. ఈ జాబితాలో వీరి మొత్తం సంపద రూ. 1,000 కోట్లకు పెరిగింది.

అందరి సంపద కలిపి మొత్తంగా రూ. 44,900 కోట్లు సంపదను పెంచుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 59 శాతం సంపద పెరిగింది.
భారత్ నుంచి వ్యాపార రంగంలో వేగంగా దూసుకెళ్తున్న యువ పారిశ్రామికవేత్తల జాబితాను IIFL Wealth Hurun India 40 & Under Self-Made Rich List 2020 జాబితాలో చేర్చింది.

ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన బిలియనీర్లలో Zerodha సహ వ్యవస్థాపకులు నితిన్ కామత్ (40) నిఖిల్ కామత్ (34) టాప్ ర్యాంకులో నిలిచారు. వీరిద్దరి మొత్తం సంపద రూ. 24,000 కోట్లకు పెరిగింది.

ఈ ఇద్దరు సోదరుల తర్వాతి స్థానాల్లో Divyank Turakhia (38) బిలియనీర్‌గా కొనసాగుతున్నారు.

2016లో media.net అమ్మేసిన తర్వాత దివ్యాంక్ బిలియనీర్‌గా అవతరించాడు. ప్రస్తుతం ఇతడి సంపాదన రూ.14,000 కోట్లుగా అంచనా.

Amod Malviya, Sujeet Kumar & Vaibhav Gupta :

దివ్యాంక్ త్రిపాఠి రెండో ర్యాంకులో ఉండగా.. తర్వాతి స్థానాల్లో భారతీయ యువ బిలియనీర్లుగా Udaan సహా వ్యవస్థాపకులు Amod Malviya, Sujeet Kumar, Vaibhav Gupta మూడో ర్యాంకులో నిలిచారు.

నితిన్, నిఖిల్ కామత్ వ్యక్తిగతంగా తమ సంపాదన మొత్తం కలిపి రూ.13,100 కోట్లు.

Self-Made Rich List 2020Riju Ravindran :
Byju Raveendran సోదరుడు Riju Ravindran (39) ఏళ్ల వయస్సులోనే తన రూ.7,800 కోట్ల సంపాదనతో ఆరో ర్యాంకులో నిలిచాడు.

ఆగస్టు 2020లో Byju తర్వాతి స్థానంలో 10 బిలియన్ డాలర్ల సంపాదనతో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే రవీంద్రన్ సంపాదన 117 శాతం పెరిగింది.

Binny Bansal & Sachin Bansal :
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం Flipkart సహా వ్యవస్థాపకులైన Binny Bansal, (37), Sachin Bansal (39) వయస్సులోనే రూ.7,500 కోట్ల సంపాదనతో ఏడో ర్యాంకులో నిలిచారు.

ఈ ప్లాట్‌ఫాం నుంచి నిష్క్రమించినప్పటికీ కూడా తమ స్వంత కొత్త వెంచర్‌లను ఏర్పాటు చేసుకున్నారు.

Ritesh Agarwal :
ఓయో రితీష్ అగర్వాల్ తన సంపాదనలో 40 శాతం కోల్పోయినప్పటికీ దేశంలో పిన్న వయస్సు బిలియనీర్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. రితేశ్ తన 26ఏళ్ల వయస్సులో రూ.4,500 కోట్లు సంపాదనతో బిలియనీర్ గా అవతరించాడు.

Bhavish Aggarwal :
ఓలా క్యాబ్స్ సహా వ్యవస్థాపకులైన Bhavish Aggarwal రూ.3,500 కోట్ల సంపాదనతో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. జూలై 2020లో ఓలా.. ఒక్కో నామమాత్రపు షేరుకు రూ.10 చొప్పున ఈక్విటీ షేర్లను జారీ చేసేలా అగర్వాల్‌ను ప్రోత్సహించింది. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే అగర్వాల్ సంపాదన 13శాతం పెరిగింది.