Amit Shah: చినజీయర్‌ స్వామి సేవలు చాలా గొప్పవి -అమిత్ షా

శంషాబాద్‌ ముచ్చింత్‌లోని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భగవత్‌ రామాజానుల సహస్రాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు.

Amit Shah: చినజీయర్‌ స్వామి సేవలు చాలా గొప్పవి -అమిత్ షా

Amith Sha

Amit Shah: బంధనాలను పక్కకు తోసి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్మాత్మక విప్లవమూర్తి, సమతా మూర్తి భగవాద్రామానుజులు నడయాడిన నేల పునీతమవబోతోంది. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టానికి ఆహ్వాన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది.

శంషాబాద్‌ ముచ్చింత్‌లోని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఈ వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భగవత్‌ రామాజానుల సహస్రాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ముఖ్యమైన నేతలను ఆహ్వానిస్తున్నారు. మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, మైహోం డైరెక్టర్లు రంజిత్ రావు, రాము రావుతో కలిసి చినజీయర్‌ స్వామి పలువురు కేంద్రమంత్రులకు ఆహ్వానాలు అందజేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి వేడుకలకు ఆహ్వానించి, ముచ్చింతల్‌లో రామానుజ ప్రాజెక్టుపై, భగవత్‌ రామానుజుల జీవిత విశేషాలు, కార్యక్రమ విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమానికి తప్పక వస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు.

త్రిదండి చిన్న జీయర్‌ స్వామి తనను కలిసిన విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ఈ రోజు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీని కలిసే గొప్ప అదృష్టం కలిగింది. మానవజాతి మనుగడ కోసం నిస్వార్ధంగా ఆయన చేస్తున్న సేవ చాలా గొప్పది. శ్రీ రామానుజాచార్య ఆలోచనలను భక్తితో వ్యాప్తి చేయడం గోప్ప విషయం.” అంటూ ట్వీట్ చేశారు అమిత్ షా.

అంతకుముందు విగ్రహావిష్కరణకు రావాలంటూ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు చినజీయర్‌ స్వామి ఆహ్వానం అందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్‌ చౌబే, శోభా కరంద్లాజే, నితిన్‌ గడ్కరీ, కిషన్ రెడ్డిలకు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి ఆహ్వానాలు అందజేశారు చినజీయర్‌ స్వామి. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి ఉపయోగించనున్నారు.