Semman Instead Of Semen : వీర్యానికి బదులు ఎర్రమట్టి అని టైపింగ్.. దోషి నిర్దోషి అయిపోయాడు

ఓ చిన్న తప్పు దోషికి వరంలా మారింది. ఓ చిన్న పొరపాటు ఆ దోషిని నిర్దోషిని చేసింది. చివరికి జరిగిన పొరపాటు తెలిసి కోర్టు సహా అంతా విస్తుపోయారు. ఆ తర్వాత తప్పుని సరిదిద్దిన కోర్టు దోషికి శిక్ష పడేలా చేసింది. సీమెన్, సెమ్మాన్.. ఈ రెండు పదాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. అసలేం జరిగిందంటే...

Semman Instead Of Semen : వీర్యానికి బదులు ఎర్రమట్టి అని టైపింగ్.. దోషి నిర్దోషి అయిపోయాడు

Semman Instead Of Semen

Semman Instead Of Semen : ఓ చిన్న తప్పు దోషికి వరంలా మారింది. ఓ చిన్న పొరపాటు ఆ దోషిని నిర్దోషిని చేసింది. చివరికి జరిగిన పొరపాటు తెలిసి కోర్టు సహా అంతా విస్తుపోయారు. ఆ తర్వాత తప్పుని సరిదిద్దిన కోర్టు దోషికి శిక్ష పడేలా చేసింది. సీమెన్, సెమ్మాన్.. ఈ రెండు పదాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. అసలేం జరిగిందంటే…

ఓ పదం తప్పుగా టైప్ కావడంతో దోషి నిర్దోషి అయ్యాడని మద్రాస్ హైకోర్టు తెలిపింది. 2017లో ఓ వ్యక్తి రెండేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించాడు. ఈ కేసులో చిన్నారి తల్లి వాంగ్మూలంలో సీమెన్(వీర్యం) అనే పదం బదులు సెమ్మాన్(ఎర్రమట్టి) అనే తమిళ పదం టైప్ అయ్యింది. తమిళంలో సెమ్మాన్ అంటే ఎర్రమట్టి అని అర్థం వస్తుంది. ఆ వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఆ నిందితుడు నిర్దోషి అని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో కంగుతిన్న తల్లి హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పుని సవాల్ చేసింది. విచారణ సమయంలో టైపింగ్ తప్పును కోర్టు గుర్తించింది. ఆ తర్వాత అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

టైపింగ్ తప్పు కారణంగా ఆ వ్యక్తి దాదాపు మూడేళ్లు స్వేచ్చగా బయట తిరిగాడు. రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు బెంచ్(జస్టిస్ వేల్ మురుగన్) ఈ కేసుని విచారించింది. 2017లో ఆమె తన రెండేళ్ల 9 నెలల కూతురిని కోర్టుయార్డ్ లో వదిలి సరుకులు కొనేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూస్తే అక్కడ పాప కనిపించ లేదు. కాసేపటి తర్వాత పొరుగింట్లో ఉండే వ్యక్తి పాపను తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి వెళ్లాడు. పాపను తీసుకుని తల్లి ఇంటికి వెళ్లింది. పాపకు అన్నం పెట్టింది. అయితే పాప తినలేదు. పైగా గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టింది. ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందంటూ ఏడ్చింది. దీంతో కంగారుపడిన తల్లి పాప దుస్తులు చూసింది. పాప శరీరంపైన, దుస్తులపైన తెలుపు రంగులో మరకలు ఉండటం గుర్తించింది. రెండో రోజు కూడా పాప నొప్పితో బాధపడింది. దీంతో తల్లి తన పాపను ఆసుపత్రికి తీసుకెళ్లి చెక్ చేయించింది. పాపపై లైంగిక దాడి జరిగినట్టు డాక్టర్ చెప్పారు. షాక్ కి గురైన తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పొరుగింటి వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై పోక్సో(POCSO) చట్టం కింద కేసు పెట్టారు. అయితే నేరం నిరూపించడంలో విఫలం కావడంతో పోక్సో కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

దీంతో తల్లి మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన కోర్టు పొరపాటుని గుర్తించింది. టైపింగ్ పొరపాటు వల్లే దోషి నిర్దోషి అయ్యాడని చెప్పింది. వెంటనే ఆ తప్పుని సరిదిద్ది నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జూలై 2 2021న హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. టైపింగ్ లో వచ్చిన తప్పుని డిఫెన్స్ కౌన్సిల్ తమకు అనుకూలంగా మలుచుకుందని కోర్టు వ్యాఖ్యానించింది.