బెంగాల్ లో పోటీ చేయం..మమతకే మా మద్దతు : శివసేన

బెంగాల్ లో పోటీ చేయం..మమతకే మా మద్దతు : శివసేన

Sena ప‌శ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివ‌సేన పార్టీ పోటీ చేయ‌డంలేద‌ని ఆ పార్టీ నేత, ఎంపీ సంజ‌య్ రౌత్ స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చలో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చిందని సంజయ్ రౌత్ గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు

గురువారం మధ్యాహ్నాం సంజయ్ రౌత్ ఓ ట్వీట్ లో…పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందా లేదా అని చాలా మంది ఆసక్తితో ఉన్నారు. అయితే సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో ఈ అంశాన్ని చ‌ర్చించాము. ప్రస్తుత తరుణంలో బెంగాల్‌లో దీదీ వర్సెస్ మిగతా మొత్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని “M”లు-మనీ,మజిల్(బలం)మరియు మీడియా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉండాలని శివసేన నిర్ణయించుకుంది. మ‌మ‌తా బెన‌ర్జీ నిజ‌మైన బెంగాలీ శివంగి, ఆమె ఘ‌న విజ‌యం సాధించాల‌ని శివసేన కోరుకుంటున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు.

కాగా, ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి. అయితే బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌పై మమతా బెనర్జీ సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒకే విడత పోలింగ్ పెట్టి బెంగాల్‌కు మాత్రం 8 విడతల్లో పోలింగ్ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఒక లాయర్ సుప్రీంను కూడా ఆశ్రయించారు.