BJP MLA Died : నిద్రలోనే కన్నుమూసిన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే..మోదీ సంతాపం

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే హర్బన్స్ కపూర్(76) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. డెహ్రాడూన్ లోని తన నివాసంలో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

BJP MLA Died : నిద్రలోనే కన్నుమూసిన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే..మోదీ సంతాపం

Kapoor

BJP MLA Died :  ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే హర్బన్స్ కపూర్(76) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. డెహ్రాడూన్ లోని తన నివాసంలో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. హర్బన్స్​ కపూర్ మరణానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు.

హర్బన్స్​ మృతి పట్ల సీఎం పుష్కర్​ సింగ్​ ధామీ, రాష్ట్ర భాజపా శ్రేణులు సంతాపం తెలిపాయి. హర్బన్స్​ కపూర్ మరణవార్త తెలియగానే ఆయన ఇంటికి వెళ్లారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. హర్బన్స్ కు నివాళులర్పించిన సీఎం..ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. హర్బన్స్​ మృతి పట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు,కార్యకర్తలు సంతాపం తెలిపారు.

హర్బన్స్​ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్ లో మోదీ…” ఉత్తరాఖండ్​ బీజేపీ సీనియర్​ నేత హర్బన్స్​ గారి మరణం కలచివేస్తుంది. ప్రజా సేవ, సామాజిక సంక్షేమానికి ఆయన చేసిన కృషికి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు.

1946లో ప్రస్తుత పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తున్క్వాలోని పంజాబీ హిందూ కుటుంబంలో హర్బన్స్ కపూర్ జన్మించారు. అయితే దేశ విభజన తర్వాత వీరి కుటుంబం ఉత్తరాఖండ్ లోని డెహ్రూడూన్ లో స్థిరపడింది. హర్బన్స్​ వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2007 నుంచి 2012 వరకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​గా విధులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోక ముందు 1991 జులై నుంచి 1992 డిసెంబర్ వరకు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 2001-2002 మధ్య కాలంలో ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు.

ALSO READ Delhi Omicron Threat : ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం : సీఎం కేజ్రీవాల్