Mumbai Ship Drugs : ముంబై క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసు.. బిట్‌ కాయిన్స్ ద్వారా కొనుగోళ్లు?

ముంబై క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది.

Mumbai Ship Drugs : ముంబై క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసు.. బిట్‌ కాయిన్స్ ద్వారా కొనుగోళ్లు?

Mumbai Drugs

Sensational issues in Mumbai Drugs : ముంబై క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది.. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన బాలీవుడ్ హై ప్రొఫైల్ సెలబ్రిటీలు… డ్రగ్స్‌ పొందేందుకు కొత్త కొత్త మార్గాలను ఫాలో అవుతున్నారు. డ్రగ్స్‌ అమ్మకందారుల నుంచి మత్తు పదార్ధాలను కొనుగోలు చేసేందుకు… క్రిప్టో కరెన్సీని వాడినట్టుగా ఎన్సీబీ అనుమానిస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.

డార్క్ వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్‌కు ప్రత్యామ్నాయం. దీన్ని ఉపయోగించాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్లు, కన్ఫిగరేషన్స్ ఉండాలి.. మూడో కంటికి తెలియకుండా ఈ డార్క్ వెబ్‌లో డ్రగ్స్‌ ఆర్డర్స్ ఇచ్చినట్టు NCB గుర్తించింది. డ్రగ్స్‌కు పేమెంట్స్ చేసే విషయంలోనూ ఆర్యన్ అండ్ గ్యాంగ్.. చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ద్వరా లావాదేవీలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బిట్‌ కాయిన్ల రూపంలో పేమంట్లు చెల్లించినట్టు సమాచారం. ప్రస్తుతం NCB అదుపులో ఉన్న డ్రగ్‌ పెడ్లర్ శ్రేయాస్‌ నాయర్‌ను ఇదే కోణంలో విచారిస్తున్నారు.

Mumbai : రేవ్ పార్టీలో షారుఖ్ ఖాన్ కొడుకు

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది ఎన్సీబీ.. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 11కు చేరింది.. ఇప్పటికే క్రూయిజ్‌ షిప్‌లో ఈవెంట్‌ ఆర్గనైజ్‌ చేసిన నలుగురు ఈవెంట్‌ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.. అసలు ఈ ఈవెంట్‌ ఎవరి ఆధ్వర్యంలలో జరుగుతోంది? ఈ డ్రగ్స్‌ దందా విషయం వారికి తెలుసా? అన్న కోణంలో వారిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.

మరోవైపు డ్రగ్స్‌ కేసులో అడ్డంగా బుక్కైన ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఉచ్చు బిగుస్తోంది.. అక్టోబర్‌ 7 వరకు ఎన్సీబీ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించడంతో ఆర్యన్‌పై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఎన్సీబీ రెడీ అయ్యింది.. ఎన్సీబీ జరిపిన విచారణలో పలు డ్రగ్స్‌ లింక్స్‌ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌, మున్‌ మున్‌లను ఈ నెల 11 వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ.. కోర్టును కోరినా ఏడు వరకు మాత్రమే కస్టడీకి ఇచ్చింది.
Bollywood : రేవ్ పార్టీ కేసు, సమీర్ వాంఖెడే ఎవరో తెలుసా ?

ఇక ఎన్సీబీ విచారణలో కీలక విషయాలు గుర్తించినట్టు తెలుస్తోంది.. ఆర్యన్‌, అర్భాజ్‌ వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించిన ఎన్సీబీ అధికారులు.. వారికి ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ సిండికేట్‌తో కోడ్‌ పద్ధతిలో చాట్ చేసినట్టు గుర్తించారు.. వారేవరో తెలిసి చేశారా? తెలియక చేశారా? ఎన్నాళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది? డ్రగ్స్‌ ఎలా సేకరిస్తున్నారు? ఎవరు సప్లైయ్‌ చేస్తున్నారు? అన్న విషయాలపై ఎన్సీబీ దృష్టి సారించనుంది.