Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

బ్రిజ్‌భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు

Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

Wrestlers Protest: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించారని, ఛాతిపై చేతులు వేయడం, శరీర భాగాలను తాకడం, గదిలోకి పిలిచి అసభ్యంగా మాట్లాడడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లలో వెల్లడైంది. ఇక గాయపడిన రెజ్లర్‌తో మరీ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Coromandel Express Accident : ఘోర రైలు ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం

తన కోరిక తీరుస్తానంటే చికిత్సకయ్యే ఖర్చంతా ఫెడరేషన్‌ భరిస్తుందని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. మే నెలలో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Odisha Train Crash: భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం…రైలు ప్రమాదాల పర్వం

ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదులో డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ పేరు కూడా ఉంది. ఇదిలా ఉండగా, బ్రిజ్‌భూషణ్‌ ఈ నెల 5న ఉత్తరప్రదేశ్‌లో ‘జన చేతన మహార్యాలీ’ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో భద్రతా కారణాలతో అధికారులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.