Sensex : బుల్ దూకుడు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టార్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 2021, జూలై 22వ తేదీ గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరకు భారీ లాభాలతోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావమే ఇందుకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Sensex : బుల్ దూకుడు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Sensex

Sensex, Nifty : దేశీయ స్టార్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 2021, జూలై 22వ తేదీ గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరకు భారీ లాభాలతోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావమే ఇందుకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అమెరికాలో డెల్టా వేరియంట్ భయంతో షేర్ల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ల పనితీరు అద్భుతంగా ఉందని అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచీ వెల్లడించడంతో అక్కడి మార్కెట్లు పుంజుకున్నాయి.

Read More : Strange Rule : వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తాం..

ఈ ప్రభావం దేశీయ సూచీలపై స్పష్టంగా కనిపించింది. బ్యాంకింగ్, ఆర్ధిక, రియాల్టీ, టెక్ రంగాల షేర్ల కొనుగోళ్లతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 638.70 పాయింట్లు (52,837.21) వద్ద స్థిరపడగా..నిఫ్టీ 191.90 పాయింట్ల (15,824) వద్ద ముగిసింది. జెఎస్ డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్ర, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. జిందాల్ స్టీల్, జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్, జుబ్లియంట్ ఫుడ్ వర్క్స్, ఐడీఎఫ్ సీ, మాసెక్ట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Read More : Vanitha Vijay Kumar: పవర్ స్టార్‌తో వనితా నాలుగో పెళ్లి?

మరోవైపు అమెరికా డాలర్ ట్రేడింగ్ అప్రమత్తంగానే ఉంది. మూడు నెలల క్రితం డాలర్ సూచీ 93.194 ఉండగా..ఇప్పుడు అది 92.812కు తగ్గింది. మార్కెట్ లో కీలక సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవ్వడం కలిసి వస్తోందని, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.19 శాతం, మిడ్ క్యాప్ 0.75 శాతం పెరగడం కూడా సూచీలకు బలాన్ని ఇస్తోందని విశ్లేస్తున్నారు.