Stock Markets : కోవిడ్ దెబ్బకు కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు..

కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కరోనా భయాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లతో క్షీణించాయి.

Stock Markets : కోవిడ్ దెబ్బకు కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు..

Sensex Slumps Nearly 1,400 Points, Rupee Falls Vs Us Dollar (2)

Sensex slumps nearly 1,400 points, rupee falls vs US dollar : కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కరోనా భయాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) సెన్సెక్స్ దాదాపు 1,400 పాయింట్లతో క్షీణించాయి. రోజువారీ కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు ఫస్ట్ టైం లక్ష మార్క్ ను దాటేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్షీణించాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు విధించాయి. దేశ ఆర్థిక పునరుద్ధరణ వేగంపై ఆందోళనలను రేకెత్తించాయి. సెన్సెక్స్ కనిష్టంగా 48,638ను తాకినప్పుడు 1391 పాయింట్ల వరకు పడిపోగా.. నిఫ్టీ 14,500 కన్నా తక్కువకు పడిపోయింది.

ఈ రోజు ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే పడిపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్‌ అయ్యాయి. కరోనా కేసుల సంఖ్య మదుపర్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు 4 శాతానికి పైగా నష్టాల్లో నడుస్తున్నాయి. ఉదయం 11:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1307 పాయింట్ల నష్టంతో 48,722 వద్ద.. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారి 14,496 వద్ద ట్రేడవుతోంది. ఐటీ షేర్లు రాణిస్తుండడం ఒకింత నష్టాల్ని కట్టడి చేస్తున్నాయనే చెప్పొచ్చు.

1) ఫైనాన్షియల్స్ భారీ అమ్మకపు ఒత్తిడికి లోనయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్., బజాజ్ ఫైనాన్స్ ఎస్బిఐ 4శాతం, 5శాతం మధ్య క్షీణించాయి
2) అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 73.39 కు పడిపోయింది. అంతకుముందు రోజు 73.32గా నమోదైంది.
3) దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత ఏడాదిలో చారిత్రాత్మక మాంద్యంలోకి పడిపోయింది.
మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత ఎక్కువ.. రాత్రిపూట 57,074 కొత్త కేసులను నమోదు అయ్యాయి. సోమవారం నుండి ఏప్రిల్ 30 వరకు వారంలో వారాంతపు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది.
4) ఆంక్షల మందగింపును రాష్ట్రం ప్రకటించింది. ప్రైవేట్ కార్యాలయాలు కూడా వర్క్ ఫ్రమ్ హోం మోడ్ కు మారాలని భావిస్తున్నాయి.
5) ఇండియా VIX సూచిక 14శాతం పెరిగి 22.78 కు చేరుకుంది, పెట్టుబడిదారులలో అనేక భయాలను కలిగిస్తోంది.
6) నిఫ్టీ ఐటి ఇండెక్స్ లాభాలలో టిసిఎస్, ఇన్ఫోసిస్ హెచ్‌సిఎల్ టెక్‌లతో గ్రీన్‌లో ట్రేడవుతోంది.