Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్

కశ్మీరీ సపరేటిస్ట్ లీడర్ యాసిన్ మాలిక్‌కు స్పెషల్ ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో 10లక్షల జరిమానా విధించింది ఢిల్లీ పటియాలా కోర్టు.

Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్

Yasin Malik

Yasin Malik: కశ్మీరీ సపరేటిస్ట్ లీడర్ యాసిన్ మాలిక్‌కు స్పెషల్ ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో 10లక్షల జరిమానా విధించింది ఢిల్లీ పటియాలా కోర్టు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. యాసిన్ మాలిక్‌కు రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు లాయర్ ఉమేశ్ శర్మ వివరించారు.

ఈ తీర్పుపై యాసిన్ మాలిక్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. తీవ్రవాద నిధుల కేసులో కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఆరోపణలతో సహా ఆరోపణలన్నింటినీ అంగీకరించాడు యాసిన్. ఫలితంగా ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కేసులో తీర్పును వెల్లడించింది.

Read Also: వాళ్లు సైనికులు కాదు.. ఉగ్రవాదులే..!