కరోనా వ్యాక్సిన్ మరింత ఆలస్యం…సీరం,భారత్ బయోటెక్ దరఖాస్తుల తిరస్కరణ

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 05:34 PM IST
కరోనా వ్యాక్సిన్ మరింత ఆలస్యం…సీరం,భారత్ బయోటెక్ దరఖాస్తుల తిరస్కరణ

Serum Institute of India, Bharat Biotech proposal for emergency COVID-19 vaccine use not approved due to inadequate data భారత ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం మరికొద్ది నెలల వేచి చూడక తప్పేలా లేనట్లు కనిపిస్తోంది. తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.



హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)సహకారంతో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని డెవలప్ చేయగా, పూణే లోని సీరం కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికాకి చెందిన ఫైజర్ కంపెనీ జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ కలిసి ఓ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేస్తోన్న విషయం తెలిసిందే .బ్రిటన్, బహ్రెయిన్‌ దేశాలు ఫైజర్- బయోఎన్ టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో భారత్‌ లోనూ ఆ సంస్థ దరఖాస్తు చేసింది.



అయితే, ఈ మూడు ఔషద సంస్థల అప్లికేషన్ లపై రివ్యూ చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)లోని నిపుణుల కమిటీ బుధవారం(డిసెంబర్-9,2020) సమావేశం కాగా, ఖచ్చితమైన డేటా లేని కారణగంగా సీరమ్,భారత్ బయోటెక్ సంస్థల కరోనా వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగ విజ్ణప్తిని CDSCO తిరస్కరించింది. పూర్తి సమాచారం లేనందున సీరమ్,భారత్ బయోటెక్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ సమర్థత,భద్రతపై ఈ రెండు ఔషధ సంస్థల నుంచి CDSCO మరిన్ని వివరాలు కోరినట్లు తెలుస్తోంది.



కాగా, దేశంలో కొద్దివారాల్లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా వార్తలు వ్యాక్సిన్ కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.