గుడ్ న్యూస్ : సీరం సంస్థతో కేంద్రం ఒప్పందం, వ్యాక్సిన్ డోసుల సరఫరా

గుడ్ న్యూస్ : సీరం సంస్థతో కేంద్రం ఒప్పందం, వ్యాక్సిన్ డోసుల సరఫరా

No supply schedule of vaccine shared by SII

Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 11 మిలియన్ డోసుల కొవిషీల్డ్ కొనుగోలుకు కేంద్రం డీల్ కుదుర్చుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం సాయంత్రం పూణె నుంచి మొదటి విడత డోసులు సరఫరా కానున్నాయి. ఈ టీకా ధరను రూ. 200గా సీరం నిర్ధారించింది.

వ్యాక్సిన్ సరఫరా చేయాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వచ్చినట్లు సీరం ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఆక్స్ ఫర్డ్, సీరం సంస్థలు సంయుక్తంగా కోవిషీల్డ్ టీకాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీకాల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. మంగళవారం, బుధవారాల్లో టీకా పంపిణీ ఉండొచ్చని సమాచారం. సీరం సంస్థ నుంచి కోటి పది లక్షల కోవిషీల్డ్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది.

ఒక్క డోసు ధర రూ. 220గా సీరం సంస్థ నిర్ణయించింది. కానీ..దీనిపై ఆరోగ్య శాఖ కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ధరల విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా..టీకాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకా ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించనున్నది.