Serum Institute : ఆ మినహాయింపు తమకూ ఇవ్వాలన్న సీరం

నష్టపరిహారం విషయంలో విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నాలు మినహాయింపులు కోరుతుండటం.. భారత్ దానికి సానుకూలంగా స్పందించడం తెలిసిందే.

Serum Institute : ఆ మినహాయింపు తమకూ ఇవ్వాలన్న సీరం

Serum Institute

Serum Institute నష్టపరిహారం విషయంలో విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నాలు మినహాయింపులు కోరుతుండటం.. భారత్ దానికి సానుకూలంగా స్పందించడం తెలిసిందే. త‌మ వ్యాక్సిన్ల వ‌ల్ల ఎవ‌రికైనా ఏవైనా దుష్ప్ర‌భావాలు క‌లిగినా త‌మ‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన దావాలు వేయ‌కుండా ఉండే ర‌క్ష‌ణ‌లు క‌ల్పించాల‌ని ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ‌లు చేస్తున్న డిమాండ్ కి మోడీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న‌ట్లు బుధ‌వారం వార్త‌లు వ‌చ్చాయి. ఇతర దేశాల్లో ఇటువంటి సడలింపు ఇచ్చారని,దీని వల్ల ఎటువంటి సమస్య ఉండదని..ఒక వేళ ఈ సంస్థలు అత్యవసర ఆమోదానికి భారత్‌లో దరఖాస్తు చేసుకుంటే రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం వ్యాఖ్యానించారు.

అయితే, ఫైజ‌ర్‌, మోడెర్నాలాగే తమకు కూడా అలాంటి ర‌క్ష‌ణ‌లే కావాల‌ని సీరం సంస్థ డిమాండ్ చేస్తోంది. నష్టపరిహారం విషయంలో ఒకవేళ విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరం మాత్రమే కాకుండా అన్ని దేశీయ వ్యాక్సిన్ కంపెనీలకు దీనిని వర్తింపజేయాలని గురువారం సీరమ్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని తాము భావిస్తున్నామని సీరమ్ వర్గాలు వ్యాఖ్యానించాయి.

కాగా,ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. మరో మూడు వ్యాక్సిన్ల అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న కొవావ్యాక్స్.. ట్రయల్స్ దశలో ఉంది. అలాగే కొడాజెనెక్స్ సింగిల్ డోస్ ముక్కు ద్వారా తీసుకునే టీకా యూకేలో ఒకటి, రెండు దశలు… స్పై బయోటెక్‌తో కలిసి తయారుచేస్తున్న మరో టీకా కూడా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉంది.