కరోనా వ్యాక్సిన్…వేల కోట్ల నిధుల సేకరణలో సీరం ఇన్స్టిట్యూట్

  • Published By: venkaiahnaidu ,Published On : August 18, 2020 / 08:37 PM IST
కరోనా వ్యాక్సిన్…వేల కోట్ల నిధుల సేకరణలో సీరం ఇన్స్టిట్యూట్

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్‌స్టోన్, కేకేఆర్‌తో పాటు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులతో సీరం ఇన్స్టిట్యూట్ చర్చలు జరుపుతున్నది.



సేకరించే నిధులన్నీ టీకా అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించనున్నారు. తన నిధుల సేకరణ మిషన్‌ను సెప్టెంబర్ నాటికి తగ్గించాలని యోచిస్తున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది.



మేము కొంతమంది పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నాం. కానీ అంతకు మించి ఎటువంటి వ్యాఖ్య లేదు” అని ఒక సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినిధి తెలిపారు. నిధుల సేకరణను గోల్డ్‌మన్ సాచ్స్, సిటీ, అవెండస్ నిర్వహిస్తారని సంస్థ వెబ్‌సైట్ నివేదించింది. టీకా అభ్యర్థుల కోసం సంస్థ ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని (ఎస్‌పీవీ) కూడా సీరం ఇన్స్టిట్యూట్ సిద్ధం చేస్తున్నది. .



అంతకుముందు ఆగస్టులో సీరం ఇన్స్టిట్యూట్.. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి, ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, నోవావాక్స్ నుంచి రెండు వ్యాక్సిన్ల అభివృద్ధి, పరీక్ష, పంపిణీకి 150 మిలియన్ డాలర్ల నిధులు పొందింది. ఈ టీకాలను తక్కువ మధ్య తరగతి ఆదాయ దేశాలలో పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 300-400 మిలియన్ మోతాదులను తయారు చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ యోచిస్తున్నది.