Jharkhand : చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి

జార్ఖండ్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్‌ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.

Jharkhand : చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి

Dead (1)

Seven girls died : జార్ఖండ్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్‌ జిల్లాలో జరిగింది. సంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుమఠ్‌ బ్లాక్‌లోని షేర్‌గఢ్‌ పంచాయతీ పరిధిలోని బుక్రు గ్రామంలో పది మంది బాలికలు గిరిజన పండుగ ‘కర్మ పూజ’ జరుపుకునేందుకు ఆ గ్రామ చెరువు వద్దకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడిపోయారు. రక్షించాలని కేకలు వేయడంతో వారిని కాపాడేందుకు చెరువులోకి వెళ్లి మరో ఐదుగురు బాలికలు మునిగిపోయారు. నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు బాలుమఠ్‌ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.

Corona : దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు, 309 మంది మృతి

మృతుల్లో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. మృతులు 12-20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటారు. వీరంతా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. దీంతో గ్రామస్తులు 98వ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏడుగురు బాలికల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై సీఎం హేమంత్‌ సోరెన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారన్న వార్తతో షాక్‌కు గురయ్యాయని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.