బాబోయ్ నడిరోడ్డుపై సింహాల గుంపు..చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 04:53 AM IST
బాబోయ్ నడిరోడ్డుపై సింహాల గుంపు..చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

బోనులో ఉన్నా..అడవిలో ఉన్నా సింహం సింహమే. అడవికి రాజు మృగరాజును ప్రత్యక్షంగా చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కళ్లల్లో క్రౌర్యం..నడకలో రాజసం..పంజాలో వాడి మృగరాజు సొంతం. అటువంటి సింహం…కాదు.. కాదు సింహాల గుంపు జనావాసాలలోకి వస్తే..ప్రజలు తిరిగే రోడ్లపై ప్రత్యక్షమైతే..ఒకటీ రెండూ కాదు ఏకంగా ఏడు సింహాలు గుంపు జనావాసాల్లోకి వచ్చి నడిరోడ్డుపై దర్జాగా నడిచి వెళ్తుండగా చూసిన ఎవరికైనా..వెన్నులోంచి వణుకు పుట్టకుండా ఉంటుందా? గుండె దడదడలాడకుండా ఉంటుందా? 

ఇటువంటి ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. ఏకంగా ఏడు సింహాలు రోడ్డుపై హల్ చల్ చేశారు. గత కొద్ది రోజులుగా గుజరాత్ లో కురుస్తున్న వర్షాలకు గిరి అడువుల్లోని సింహాలు బైటకు వచ్చాయి. తినటానికి తిండి దొరక గిరి ఫారెస్ట్ నుంచి జనావాసాల్లోకి వచ్చేశాయి. అడవికి సమీపంలోని జునాగడ్ నగరంలోని బాల్ నాగ్ ప్రాంతంలోకి వచ్చాయి.  ఒకదాని వెనుక ఒకటి దర్జాగా..నడుచుకుంటు వచ్చిన ఏడు సింహాలు భారతీ ఆశ్రమంలోని రోడ్డుపై సంచరిస్తు  హడలెత్తించాయి. సింహాల గుంపు నడిరోడ్డుపై నడుచుకంటూ వెళ్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్ ఫోన్ తో షూట్ చేసాడు.  వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో క్షణాల్లోనే వైరల్ గా మారాయి. 

ఈ వీడియోలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏ పక్క నుంచి ఏ సింహం వస్తుందో..తమపై దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. కాగా..కాసేపు అక్కడే సంచరించిన మృగరాజులు అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లినట్లుగా ఈ వీడియోలు ఉంది. అలా వెళ్లిన సింహాలు తిరిగి ఫారెస్ట్ కు వెళ్లాయో..లేదా నగరంలోనే తిరుగాడుతున్నాయోనని ప్రజలు భయపడుతున్నారు.