Assam : గుహవాటిలో వ్యాన్‌ను ఢీకొన్న కారు .. ఏడుగురు విద్యార్ధులు మృతి
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.

Road Accident Guwahati Assam
Assam Accident : అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గువాహటిలోని జలక్‌బారీ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పింది.ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించి కంట్రోల్ చేద్దామన్నా సాధ్యం కాలేదు. ఫలితంగా ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. అంతే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారు విద్యార్దులు కావటం మరింత విషాదాన్ని కలిగించింది.
ఈ ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు అంతా ఇంజనీరింగ్ విద్యార్ధులేనని తెలిపారు పోలీసులు.అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని పోలీస్ సకమిషనర్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్ తెలిపారు.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night. pic.twitter.com/5gELk04tCR
— ANI (@ANI) May 29, 2023