Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్‌ను సంప్రదిస్తున్న అనేక దేశాలు

ప్రధానంగా బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ, దక్షిణ కొరియా, ఒమన్ మరియు యెమెన్ దేశాలు భారత గోధుమల పై ఆధారపడ్డాయి. భారత్ తిరిగి గోధుముల ఎగుమతులు ప్రారంభించేలా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి

Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్‌ను సంప్రదిస్తున్న అనేక దేశాలు

Wheat

Wheat Exports: గోధుమల ఎగుమతులపై భారత ప్రభుత్వం విధించిన నిషేధం..ఇతర దేశాల్లో ఆహార కొరతకు దారి తీసింది. దీంతో భారత్ నుంచి గోధుమల దిగుమతి కోసం దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి కొన్ని దేశాలు. దేశీయంగా ఆహార ధాన్యాల కొరతను నివారించేందుకు ఈ ఏడాది మే 13న గోధుమల ఎగుమతిని నిషేదించింది భారత ప్రభుత్వం. అయితే రెండు రకాల సరఫరా విషయాల్లో మాత్రం ఎగుమతులు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత అధిగమించేలా దౌత్య విధానంలో భారత ప్రభుత్వం అందిస్తున్న ఆపన్న హస్తం కింద అందిస్తున్న ఎగుమతులు, మరియు, నిషేదానికి ముందు మార్పిడి సాధ్యపడని క్రెడిట్ లెటర్స్ కలిగి ఉన్న దేశాలకు గోధుమల ఎగుమతి కొనసాగించవచ్చని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఉన్నట్టుండి భారత ప్రభుత్వం గోధుమలు ఎగుమతులపై నిషేధం విధించడంతో..ఎగుమతులపై ఆధారపడ్డ కొన్ని పెద్ద దేశాలు సైతం సంకోచంలో పడ్డాయి. ప్రధానంగా బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ, దక్షిణ కొరియా, ఒమన్ మరియు యెమెన్ దేశాలు భారత గోధుమల పై ఆధారపడ్డాయి.

other stories: Arvind Kejriwal: బీజేపీకి గూండాలు, రేపిస్టులు కార్యకర్తలుగా కావాలి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈక్రమంలోనే ఆయా దేశాలకు భారత్ తిరిగి గోధుముల ఎగుమతులు ప్రారంభించేలా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి. గోధుమ ఎగుమతులను అనుమతించాలని ఈ దేశాల నుండి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం – ప్రభుత్వం విధానంలో ధాన్యం ఎగుమతుల విషయంలో, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ప్రభుత్వం తరపున ఎగుమతులను నిర్వహిస్తుంది. “తీవ్ర ఆహార ధాన్యాల అవసరం ఉన్న దేశాలు, స్నేహపూర్వక మరియు క్రెడిట్ లెటర్ ఉన్న దేశాలకు భారత్ తిరిగి గోధుమల ఎగుమతిని కొనసాగిస్తుందని గత వారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

other stories: Kanpur Mayor: దేవాలయాల స్థలాలు ఆక్రమించి బిర్యానీ షాపులు: పరిస్థితి చూసి చలించిపోయిన నగర మేయర్