corona : గర్భిణీలపై కరోనా తీవ్ర ప్రభావం

గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్‌పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది.

corona : గర్భిణీలపై కరోనా తీవ్ర ప్రభావం

Corona (6)

corona effect on pregnants : కరోనాపై పరిశోధనల్లో రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా సోకిన తర్వాత ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా పరిశోధనలో గర్భిణీలపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నట్టు తేల్చారు శాస్త్రవేత్తలు. గర్భిణీలు, పుట్టబోయే పిల్లలపై వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటి పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్‌, టీకా ప్రభావం ప్రసవం తర్వాత ఏ విధంగా ఉంటుందని చేసిన రిసెర్చ్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్‌పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది. కొంత మందికి ముందుగానే డెలివరీ అవడం, పుట్టిన పాపలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

Corona Virus : కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్‌..!

టీకాలు తీసుకున్న వారిలో కొంత మేర ప్రభావం తక్కువుందని గుర్తించారు. గర్భిణీగా ఉన్న సమయంలో టీకాలు తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. గర్భిణీలపై కరోనా ప్రభావంపై మరింత పరిశోధన అవసరమని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇందు కోసం మరో 15 వందల మంది వాలంటీర్లపై రిసెర్చ్ మొదలు పెట్టామన్నారు. మే నెలలో దీని ఫలితాలు వెల్లడిస్తామన్నారు.